News March 4, 2025
ఎర్రుపాలెం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కోగంటి సాయిరాం (29) ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.
Similar News
News March 4, 2026
ఖమ్మంలో ఈ-నామ్ 2.0 సేవలు షురూ

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్ 2.0’ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర, తూకం, కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
News March 4, 2026
ఖమ్మం: మొక్కజొన్న రైతులకు దక్కని భరోసా

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉండగా, బయట మార్కెట్లో దళారులు రూ.1,900కే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చేలోపే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యంగా కేంద్రాలు తెరిస్తే దళారులకే లాభమని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
News March 4, 2026
ఖమ్మం: అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్

ఖమ్మం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తోంది. ఇప్పటికే కారేపల్లి, నేలకొండపల్లి, పాలేరు పరిధిలోని 4 కేంద్రాలకు కనెక్షన్లు ఇచ్చినట్లు ఎస్.ఈ శ్రీనివాసచారీ తెలిపారు. చిన్నారుల సౌకర్యార్థం ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ లేని మిగిలిన కేంద్రాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన వైరింగ్ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.


