News March 4, 2025

కోనసీమ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

Similar News

News April 6, 2026

ALERT: వాషింగ్ మెషీన్ ఆన్‌ చేసి స్నానం చేస్తున్నారా?

image

వాషింగ్ మెషీన్ ఆన్‌‌లో ఉన్నప్పుడు స్నానం చేయొద్దని ఎలక్ట్రీషియన్లు సూచిస్తున్నారు. ‘మెషీన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ వల్ల షాక్ తగిలే అవకాశం ఉంది. వైబ్రేషన్, ప్రెజర్ వల్ల వైరింగ్ దెబ్బతిని తడి ప్రాంతానికి తగలొచ్చు. పైగా మెషీన్, షవర్‌కు ఒకే వేస్టేజ్ పైప్ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే దాన్ని ఆఫ్ చేశాక 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది’ అని చెబుతున్నారు. #SHARE IT

News April 6, 2026

ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు

image

AP: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. నిన్న మన్యం(D) వీరఘట్టం, నెల్లూరు(D) నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీకాకుళం, నెల్లూరు, మన్యం తదితర జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈరోజు SKL, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు <<19576125>>వర్షాలు<<>> పడతాయని APSDMA వెల్లడించింది.

News April 6, 2026

అనకాపల్లి జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం, మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులుతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు శిథిలావస్థ భవనాలు, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.