News March 4, 2025
అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే: ఎమ్మెల్సీ గాదె

AP: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన వ్యక్తే గెలిచారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన <<15643983>>వ్యాఖ్యలపై<<>> గాదె శ్రీనివాసులు నాయుడు స్పందించారు. ‘అవునా.. అచ్చెన్న నాకు మద్దతిచ్చారా? నాకు దానిపై అవగాహన లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే నేను గెలిచా’ అని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన రఘువర్మ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2026
అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ చిత్రం విడుదల పోస్ట్‌పోన్ అయింది. మే 1వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీబోర్సే నటించగా తమన్ మ్యూజిక్ అందించారు.
News March 28, 2026
రాజధానికి పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో వేడుకలు: CM CBN

AP: రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి నాది అనే భావనను ప్రజల్లో నింపేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రాజధాని చట్ట సవరణకు కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ 1న ఆమోదం తెలిపే అవకాశం ఉందని మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం వచ్చేలా కేంద్రానికి తీర్మానం పంపినట్లు పేర్కొన్నారు.
News March 28, 2026
చరణ్ లుక్.. ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటున్న ఫ్యాన్స్

‘పెద్ది’ సినిమాలో పహిల్వాన్‌గా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుక్ SMను షేక్ చేస్తోంది. కుస్తీ పోటీలోని ఆయన రగ్గుడ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన HD ఫొటోను డైరెక్టర్ బుచ్చిబాబు పోస్ట్ చేశారు. కండలు తిరిగిన దేహంతో కుస్తీ పహిల్వాన్‌గా ఊరమాస్ లుక్ చూసి ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చరణ్ మేకోవర్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.


