News March 4, 2025
భర్త ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన పరసా రాధిక తన భర్త ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. పెళ్లై 10 సంవత్సరాలైందని, భర్త ధర్మరాజు తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే ఉద్యోగం సాధించగలిగానని రాధిక తెలిపారు. భర్త గంధం ధర్మరాజు బీటెక్ చదివి సొంత ఊర్లోనే వ్యవసాయం, తేనెటీగల పరిశ్రమ నడుపుతున్నారు. రాధిక దంపతుల కుమారుడు నోయల్ మూడవ తరగతి చదువుతున్నాడు.
Similar News
News March 4, 2025
VJA: ఎమ్మెల్యే సుజనాకు స్పీకర్ కితాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ MLA సుజనా చౌదరి బడ్జెట్‌పై కూలంకషంగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. చాలా బాగా మాట్లాడారని కితాబిచ్చారు. దీంతో సుజనా మాట్లాడుతూ.. సభకు అటెండెన్స్ మరింత పెరిగితే బాగుంటుందని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
News March 4, 2025
ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మేజర్ కాలవ కట్టపై చెత్త వేయడం పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, కట్టను సంరక్షించాలని ఆదేశించారు.
News March 4, 2025
బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.