News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News March 25, 2026
రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.
News March 25, 2026
హుజూర్‌నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.


