News March 4, 2025
రౌండ్లవారీగా MLC అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే.!

MLC ఎన్నికల్లో 5 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రకి మొదటి రౌండ్-17194, రెండవ రౌండ్ -17527, మూడవ రౌండ్-16723, నాలుగో రౌండ్-16236, ఐదో రౌండ్-16,916 ఓట్లు చొప్పున వచ్చాయి. మరోవైపు PDF అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావుకు మొదటి రౌండ్-7214, రెండవ రౌండ్-6742, మూడవ రౌండ్-7404, నాలుగో రౌండ్-7828, ఐదో రౌండ్-7535 చొప్పున ఓట్లు రాగా..47872 ఓట్లతో ఆలపాటి గెలిచారు.
Similar News
News March 10, 2026
పోర్టు రైల్వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

పోర్టులోకి వచ్చే రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు హార్బర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. గూడ్స్ రైలు పోర్ట్‌లోకి వస్తుండగా ఒక్కసారిగా శబ్దంతో కరెంటు పోవడం ఎలక్ట్రికల్ రైలు ఆగిపోవడం గుర్తించిన అప్పారావు అనే వ్యక్తి ఏం జరిగిందని పరిశీలించగా పోల్ పక్కన పడిపోయిన వ్యక్తిని గమనించాడు. వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 10, 2026
పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం: భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దస్త్రాల పరిష్కారాన్ని ఈ-ఆఫీస్ విధానం ద్వారా వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. మంగళవారం సీఎస్ రామకృష్ణారావుతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలుకు శాఖల వారీగా పక్కా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వివరించారు. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో పారిశుధ్య పనులను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు.
News March 10, 2026
ASF: ఈ నెల12న సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ

ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారురు. HYD సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ASF కలెక్టర్ హరిత పాల్గొని మాట్లాడారు. శిక్షణలో భోజనం, గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు.


