News March 4, 2025
HYD: ఇంటర్ పరీక్షలు.. ఇది మీ కోసమే!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT
Similar News
News March 22, 2026
ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375
News March 22, 2026
GWL: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’.. కలెక్టర్ ప్రకటన

జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వెల్లడించారు. గత వారం తాత్కాలికంగా రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని, ఈనెల 23న జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
News March 22, 2026
ఈపీడీసీఎల్‌లో భారీగా పెరిగిన విద్యుత్ లోడ్

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. మార్చిలో రోజువారీ వినియోగం 96 మిలియన్ యూనిట్లకు చేరి సెంచరీకి దగ్గరైంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10% పెరుగుదల నమోదైంది. ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్లు వినియోగం పెరగడం ప్రధాన కారణం. గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం కూడా అధికమైంది. పీక్ అవర్స్‌లో లోడ్ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


