News March 4, 2025

హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

image

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 6, 2025

బెల్లంపల్లి: రైలు కింద పడి సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

బెల్లంపల్లి- రేచిని రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు కింద పడి కన్నాల బస్తీకి చెందిన సిలువేరు రవితేజ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం విషయంలో కుటుంబ అంతర్గత కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 6, 2025

కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

image

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.

News November 6, 2025

పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో యువకుడి ఆత్మహత్య

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (31) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన రాజు గురువారం ఉదయం తిరిగొచ్చి ఇంట్లో ఉరివేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.