News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 4, 2025
BREAKING: మహిళలకు అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ

TG: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతలో 150 డ్వాక్రా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దెను ఆర్టీసీ చెల్లించనుంది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున HYD పరేడ్ గ్రౌండ్‌లో 50 బస్సులను సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. త్వరలోనే మరో 450 సంఘాలకు బస్సులను అందించనున్నారు.
News March 4, 2025
ఏపీకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా?

AP విభజన జరిగి పదేళ్లయినా పూర్తిస్థాయి <<15642015>>రాజధాని <<>>లేదు. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించగా, 2019లో గెలిచిన YCP 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. 2024లో వచ్చిన కూటమి GOVT అమరావతే రాజధాని అని చెప్పింది. దీంతో రేపు మరో పార్టీ గెలిస్తే రాజధానిని మళ్లీ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా అన్ని పార్టీలు కలిసి APకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా? అనేది నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.