News March 4, 2025

ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.

Similar News

News January 12, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం కాదు: MLA

image

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో సీడీపీ నిధులు శూన్యమన్నారు. అర్బన్‌ను రూ.500 కోట్లతో అభివృధ్ది చేశామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. కాగా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి పది కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు.

News January 12, 2026

NGKL జిల్లాలో 809 టన్నుల యూరియా నిల్వలు: కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 809 టన్నుల యూరియా నిల్వ ఉందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 2,270 టన్నులు, ఈ నెల చివరి నాటికి మొత్తం 4,500 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రైతులందరికీ సకాలంలో ఎరువులు పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.

News January 12, 2026

నాగర్‌కర్నూల్: కులాంతర వివాహాలకు ప్రభుత్వం అండ: ఎంపీ

image

కుల వ్యవస్థ లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్న ఐదు జంటలకు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ప్రోత్సాహక చెక్కులను కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌తో కలిసి అందజేశారు. సామాజిక మార్పుకు ఇలాంటి వివాహాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.