News March 4, 2025

NGKL: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

NGKL జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు నిన్నజరిగాయి. పోలీసుల వివరాలిలా.. బిజినేపల్లి మండలం బీమునితండాకు చెందిన జాను(33) బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో మృతిచెందాడు. NGKLలోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(40) బైక్ అదుపుతప్పి కిందపడటంతో చనిపోయాడు. పెద్దపల్లి మండలం సాతాపూర్ వద్ద రెండు బైక్‌లు ఢీకొనగా.. ఆర్ఎంపీ సాంబశివుడు(25) దుర్మరణం పాలయ్యాడు.

Similar News

News March 10, 2026

పశువులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి: కలెక్టర్

image

పశువులకు సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ టీకాలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డిలో పశువుల ఆరోగ్య సంరక్షణకు 8వ విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పశువులకు ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో టీకాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దేవేందర్, తదితరులున్నారు.

News March 10, 2026

తిర్యాణి: అడవి సంపద రక్షణకు.. సిలిండర్ మార్గమా..?

image

జాతీయ అడవి, వన్య ప్రాణి పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అడవి సంపదను రక్షించేందుకు ఆ శాఖ అధికారులు అనేక రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అయితే అవి అడవి సంపదను కాపాడుతాయా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఏటా కొన్ని వేల టన్నుల వంట చెరుకు కాలుస్తున్నారని.. గిరిజనులు అడవికి వెళ్లకుండా సిలిండర్ ఉపాయాన్ని అధికారులు ముందట వేసుకున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు అందిస్తారో తెలియాల్సి ఉంది.

News March 10, 2026

ANU: ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్‌ను మంగళవారం కో ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 12 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను పొందవచ్చన్నారు.