News March 4, 2025

తక్కువ పేదరికం ఉన్న జిల్లాలో చిత్తూరుకు ఐదో స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి చిత్తూరు (39 శాతం) జిల్లా తక్కువ పేదరికం ఉన్న జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది.

Similar News

News March 2, 2026

చిత్తూరు: టీచర్లకు గమనిక

image

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.

News March 2, 2026

చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

image

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.

News March 2, 2026

నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.