News March 4, 2025
ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ కీలక సూచన

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈఓ దస్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News July 9, 2025
NLG: స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే గ్రామపంచాయతీల సరిహద్దులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. గ్రామాల్లో వార్డులను కూడా ఖరారు చేశారు. తాజాగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTCల) పునర్విభజన షెడ్యూల్‌ను ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 352కు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.
News July 8, 2025
ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
News July 8, 2025
NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.