News March 4, 2025

చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి

image

చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్‌నగర్‌ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

image

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 15, 2026

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

image

రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లబరచి అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.