News March 4, 2025
పేదరిక జిల్లాల లిస్ట్‌లో అన్నమయ్య జిల్లాకు 12వ స్థానం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అన్నమయ్య జిల్లా 12వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.
Similar News
News March 4, 2025
VJA: ఎమ్మెల్యే సుజనాకు స్పీకర్ కితాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ MLA సుజనా చౌదరి బడ్జెట్‌పై కూలంకషంగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. చాలా బాగా మాట్లాడారని కితాబిచ్చారు. దీంతో సుజనా మాట్లాడుతూ.. సభకు అటెండెన్స్ మరింత పెరిగితే బాగుంటుందని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
News March 4, 2025
ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మేజర్ కాలవ కట్టపై చెత్త వేయడం పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, కట్టను సంరక్షించాలని ఆదేశించారు.
News March 4, 2025
బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.