News March 4, 2025
జైపూర్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ KGBVలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.
Similar News
News March 4, 2025
అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.
News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్‌కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
News March 4, 2025
మద్య నిషేధం ఉన్నప్పటికీ 4 సెకండ్లకో బాటిల్ సీజ్!

గుజరాత్‌లో మద్య నిషేధ చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్కహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. కానీ, అక్కడ ప్రతి 4 సెకండ్లకు ఓ లిక్కర్ బాటిల్ సీజ్ అవుతోంది. 2024లో రూ.144 కోట్లు విలువ చేసే దాదాపు 82 లక్షల బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్ సిటీ & రూరల్‌లోనే 4.38 లక్షల బాటిళ్లు సీజ్ అయ్యాయి. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని గుర్తిస్తున్నారు.