News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాల్లో బాపట్ల జిల్లాకు 4వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో బాపట్ల జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

Similar News

News September 13, 2025

HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.

News September 13, 2025

HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

image

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.

News September 13, 2025

పటాన్‌చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

image

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.