News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.
Similar News
News September 16, 2025
నేడు సంగారెడ్డిలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

సంగారెడ్డిలో నేడు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ సెమినార్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కి ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News September 16, 2025
VZM: ఉమ్మడి జిల్లాలో 578 పోస్టుల భర్తీ

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 578 పోస్టులు భర్తీ అయినట్లు ప్రభుత్వం తుది జాబితా విడుదల చేసింది. 583 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4 ఉర్ధూ పోస్టులు, SA పీడీకి అభ్యర్థులు లేకపోవడంతో ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈనెల 19న అమరావతిలో CM చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. 18న అమరావతి వెళ్లేందుకు మోపాడలోని శిక్షణ కేంద్రం నుంచి బస్సులు బయలుదేరనున్నాయని DEO మాణిక్యంనాయుడు తెలిపారు.
News September 16, 2025
KNR: KTR దావా.. MP సంజయ్ రియాక్షన్ ఇదే..!

MLA KTR వేసిన <<17724246>>పరువు నష్టం దావా<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పిటిషన్‌ను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటానన్నారు. ఇలాంటి చర్యలతో KTR బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘9 సార్లు జైలుకెళ్లొచ్చా, 100కు పైగా కేసులు ఫేస్ చేస్తున్న. KTRలా కేసులు వేయాలంటే ఇప్పటికే ఎన్నో కేసులు అయ్యేవి’ అన్నారు. తంబాకు తింటానని తనపై దుష్ప్రచారం చేశారని ఫైరయ్యారు. దీనిపై సవాల్ విసిరినా KTR స్వీకరించలేదన్నారు.