News March 4, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

image

సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట మార్గాల్లో ఈ బస్సులు నడుపుతామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 4, 2025

ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల కలెక్టర్

image

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మేజర్ కాలవ కట్టపై చెత్త వేయడం పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, కట్టను సంరక్షించాలని ఆదేశించారు.

News March 4, 2025

బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

image

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

News March 4, 2025

KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

error: Content is protected !!