News March 4, 2025
జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు వీరే

జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన రౌతుల హర్ష (14), వేణుం మణికంఠ (17) , షేక్ అబ్దుల్లా (17)లు జగ్గంపేట వస్తుందంగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
Similar News
News January 1, 2026
కర్నూలు, నంద్యాల జిల్లాల న్యూస్ రౌండప్

★ నేటి నుంచి రేషన్ పంపిణీ
☞ సంక్రాంతి కానుకగా రూ.20కే కిలో గోధుమ పిండి
★ ఆదోని మండలం-2 పాలన మొదలు
★ రేపటి నుంచి కందుల కొనుగోళ్లు షురూ
★ ఎమ్మిగనూరులో 25 తులాల బంగారం చోరీ
★ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన న్యూ ఇయర్ సంబరాలు
★ నంద్యాల: జనవరి 17 నుంచి స్వచ్ఛరథం
★ కర్నూలు: గృహ లబ్ధిదారులకు సమస్యలా.. నేడు ఫోన్ ఇన్
☞ 08518257481
★ కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసిన ఎస్పీ
News January 1, 2026
‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
News January 1, 2026
అల్లూరి: తొలిరోజు 91.6 శాతం పంపిణీ

అల్లూరి ఉమ్మడి జిల్లాలో బుధవారం 91.6శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ వీ.మురళి తెలిపారు. 22 మండలాల పరిధిలో మొత్తం 1,21,907 మంది లబ్ధిదారులకు రూ.51,37,79,000 విడుదలైందన్నారు. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 1,11,669 మందికి రూ.46,96,79,000 పింఛన్ సొమ్మును పంపిణీ చేశారన్నారు.


