News March 4, 2025
నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు

పోలీస్ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, నిజాయితీ గల విశ్రాంత అడిషనల్ ఎస్పీ భోగాది పృథ్వీ నారాయణ తుది శ్వాస వదిలారు. గతంలో నెల్లూరు నగర సీఐగా పనిచేశారని పోలీస్ సంఘం నాయకులు శ్రీహరి తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడని, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Similar News
News March 4, 2025
నెల్లూరు: రిజర్వాయర్లో మహిళ డెడ్ బాడీ

వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
News March 4, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. 15 ఏళ్లు జైలు శిక్ష

జలదంకి మండలం బ్రాహ్మణక్రాకకు చెందిన దేవరకొండ విజయ్ కుమార్ అనే నిందితుడికి పోక్సో, కిడ్నాప్ కేసులలో 15 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.22 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. 2017లో మండలానికి చెందిన ఓ బాలిక(14)ను ప్రేమ పేరుతో వేధించి, కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేసిన సిబ్బందిని SP కృష్ణకాంత్ అభినందించారు.
News March 4, 2025
ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.