News March 4, 2025
మెదక్: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా పీసీపీఎన్ డీటీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆడపిల్లల బ్రాణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చారు.
Similar News
News January 15, 2026
మెదక్: రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో టెన్షన్!

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ స్థానం ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. రిజర్వేషన్ల లెక్కలను బట్టి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 14, 2026
మెదక్: యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్‌కు దూరం, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
News January 14, 2026
జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.


