News March 4, 2025
రజినీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ

AP: మాజీ మంత్రి విడుదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఐపీఎస్ జాషువాతో కలిసి స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. గ్రీన్ సిగ్నల్ రాగానే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కేసు నమోదు చేయనున్నారు.
Similar News
News March 4, 2025
మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్‌లో వేలాది ఉద్యోగాల కోత

మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్‌బక్స్ 1100, హెచ్‌పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News March 4, 2025
సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
News March 4, 2025
సీఎం రేవంత్‌కు పాలన చేతకావట్లేదు: ఎంపీ లక్ష్మణ్

TG: KCR చేసిన తప్పిదాలే సీఎం రేవంత్ చేస్తున్నారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. BRS చీఫ్‌కు పట్టిన గతే ఈయనకూ పడుతుందని జోస్యం చెప్పారు. MLC ఎన్నికలు ఇందుకు నాంది అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ముసుగులో BRS నేతలు లబ్ధి పొందారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎంకు పాలన చేతకాక గందరగోళంతో రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఫైరయ్యారు.