News March 4, 2025
కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 4, 2025
విశాఖ: మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. మొత్తం 29,997 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు డీఈవో తెలిపారు.
News March 4, 2025
ఎమ్మెల్సీ కౌంటింగ్: రసవత్తర పోటీ

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.
News March 4, 2025
LIC సంపద ₹1.45లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌మార్కెట్ల పతనంతో LIC స్టాక్ పోర్టుఫోలియో విలువ ఏకంగా ₹1.45లక్షల కోట్లు తగ్గిపోయింది. 2024 DECలో ₹14.9లక్షల కోట్లుగా ఉన్న విలువ ఇప్పుడు ₹13.4లక్షల కోట్లకు చేరుకుంది. ITCలో ₹17,007CR, TCSలో ₹10,509CR, SBIలో ₹8,568CR, INFYలో ₹7640CR, LTలో ₹7605CR మేర నష్టపోయింది. 310కి పైగా కంపెనీల్లో LIC ఒక శాతానికి పైగా పెట్టుబడి పెట్టింది. RILలో అత్యధికంగా ₹1.03L CR, ITCలో ₹75,780L CR హోల్డింగ్స్ ఉన్నాయి.