News March 4, 2025

పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

image

రేపటి నుంచి ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తూ చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు.

Similar News

News November 1, 2025

NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

image

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌ను<<>> సంప్రదించండి.

News November 1, 2025

కొంగ, జింక ఆకారంలో ఎలక్ట్రిక్ పోల్స్.. ఎందుకంటే?

image

స్థానిక కల్చర్, సంస్కృతి, వైల్డ్ లైఫ్‌ను ప్రతిబింబించేలా ఆస్ట్రియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌ను ఏర్పాటుచేస్తున్నారు. కొంగలు, దుప్పులు, జింకల ఆకారంలో నిర్మించిన పోల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతితో మిళితమైన డిజైన్ల వల్ల గ్రిడ్ విస్తరణ ప్రాజెక్టులకు ప్రజల సహకారమూ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రియేటివ్ ఇంజినీరింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News November 1, 2025

ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించాలి: JC

image

అన్నమయ్య జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను అధికారులందరూ వినియోగించాలని JC ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తదితర శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా సుపరిపాలనపై రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌పై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.