News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 19, 2026
భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2026
చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>
News April 19, 2026
టిమ్ డేవిడ్.. IPLలో అరుదైన మైల్‌స్టోన్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. IPLలో అతి తక్కువ బంతుల్లో (560) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) తర్వాత ఆయనే టాప్. అంతేకాదు కనీసం వెయ్యి పరుగులు చేసిన వారిలో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక బ్యాటర్ డేవిడ్ కావడం విశేషం.


