News March 4, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News January 6, 2026
ఆహార భద్రతపై పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్

భువనగిరి: జిల్లాలో ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు నిత్యం వినియోగించే ఆహార పదార్థాలు కల్తీ కాకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 6, 2026
ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నియమాలు పాటించాలి: డీఎస్పీ

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
News January 6, 2026
నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.


