News March 22, 2024
విజయవాడ: సివిల్ సర్వీసెస్‌లో మహేశ్‌కు కాంస్య పతకం

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.
Similar News
News April 14, 2025
మచిలీపట్నం: అంబేడ్కర్‌కు నివాళులర్పించిన కొల్లు

మచిలీపట్నంలో సోమవారం అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, తదితరులు లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News April 14, 2025
విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.
News April 14, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ వద్ద హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. కొక్కిలిగడ్డకు చెందిన రాయన కృష్ణ తేజస్ (18), నాగ జశ్వంత్ బైకుపై మోపిదేవి వెళ్లేందుకు హైవే పైకి రాగానే వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తేజస్ మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగ జస్వంత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.