News March 4, 2025

దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు.

News March 4, 2025

టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

image

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.

News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

error: Content is protected !!