News March 4, 2025

జగిత్యాల జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..!

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం పెగడపల్లి, మల్యాల్, ఐలాపూర్, అల్లిపూర్, కొల్వాయి, వెల్గటూర్, ధర్మపురి, సిరికొండ, గొల్లపల్లిలో 39.2℃, మన్నెగూడెం, నేరెళ్ల, మారేడుపల్లి, రాఘవపేట 39.1, సారంగాపూర్ 38.9, గోదూరు, రాయికల్, పూడూర్ 38.8, మేడిపల్లె, ఎండపల్లి, గుల్లకోట, జగిత్యాల, కోరుట్ల 38.7, మెట్‌పల్లి, మద్దుట్ల, మల్లాపూర్ 38.6, తిరుమలాపూర్ 38.1, జైన 37.9℃గా ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News January 4, 2026

కూరగాయల పంట పెరిగింది: మాధవి

image

ఉద్యానశాఖ చేపట్టిన చర్యల వల్ల గతేడాది సీజన్ 767 ఎకరాలుగా ఉన్న కూరగాయల విస్తీర్ణం ఈ ఏడాదిలో 1,458 ఎకరాలకు పెరిగిందని జిల్లా ఉద్యానవన అధికారి మాధవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతులు 1,710 మంది వరకు ఉన్నారన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్ షీట్ వేసిన రైతులకు ఎకరానికి రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.

News January 4, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీ‌ఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 4, 2026

చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

image

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.