News March 4, 2025

BIG ALERT.. జాగ్రత్త

image

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల చివరి 2 వారాలు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న జగిత్యాల(D) బీర్‌పూర్‌లో అత్యధికంగా 38.3 డిగ్రీలు, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, వనపర్తిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

Similar News

News March 4, 2025

టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

image

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.

News March 4, 2025

పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

image

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

News March 4, 2025

SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

image

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

error: Content is protected !!