News March 4, 2025
లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.
Similar News
News March 4, 2025
ఏలూరు: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. B.com పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
News March 4, 2025
సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
News March 4, 2025
హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 2025-2026 సంవత్సరానికి గాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నట్లు సహాయ సంచాలకులు ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. NLG& SRPT జిల్లాలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ చేయదలచిన అసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.