News March 4, 2025

MLC ఎన్నికలు.. అప్పుడు PRTU.. ఇప్పుడు BJP

image

టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందారు. మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోలు కాగా.. 24,144 చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. మల్క కొమురయ్య 12,959, వంగ మహేందర్‌రెడ్డి 7,182, అశోక్‌కుమార్‌ 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గతంలో PRTU బలపరిచిన రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి బీజేపీ గెలిచింది.

Similar News

News March 3, 2026

MNCL: జైలు నుంచి రేపు బాల్క సుమన్ విడుదల

image

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. క్యాతనపల్లి ఘర్షణ కేసులో సోమవారం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల 18నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.

News March 3, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి18 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.50,721 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News March 3, 2026

KNR: క్రీడా పాఠశాలల్లో ప్రవేశం.. రేపే చివరి తేదీ

image

KNRలోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదని KNR జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడిKNR జిల్లాలో 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలి. MAR 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, APRIL 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. వివరాలకు 9704061725 సంప్రదించవచ్చు.