News March 4, 2025

అన్నమయ్య జిల్లాలో నేడు కూడా పెన్షన్ల పంపిణీ.!

image

అన్నమయ్య జిల్లాలో 1వ తేదీ నుంచి పెన్షన్‌లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి నేడు కూడా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాకుండా అనంతపురం, తిరుపతి, చిత్తూరు, , ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు కూడా ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News March 17, 2026

VZM: పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీసీ అనంతరం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 9వ తేదీలోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా పాసుపుస్తకాలు తయారు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. మ్యుటేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

తిరుపతిలో గరుడ వారధిపై ఇద్దరు యువకుల మృతి

image

బిహార్‌కు చెందిన ఉమేష్ కుమార్(35), తరుణ్(36) తిరుపతిలోని పవర్ టెక్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరూ స్కూటీపై వస్తూ గరుడ వారధిపై బ్లిస్ సర్కిల్ వద్ద డివైడర్ ఢీకొని రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉమేష్ కుమార్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ సోమవారం కన్నుమూశాడు. బంధువుల ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేశారు.

News March 17, 2026

బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.