News March 4, 2025

SLBC టన్నెల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక

image

SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీరు ఉబికి రావడంతో భారీగా బురద పేరుకుపోయింది. ఈ పరిస్థితి మృతదేహాల వెలికితీత మరింత కష్టతరం చేస్తోంది. నీటి ప్రవాహం నియంత్రించలేకపోతే మరో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Similar News

News March 4, 2025

మోతె: ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

image

మోతె మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

News March 4, 2025

అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249  మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.

News March 4, 2025

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

image

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్‌(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.

error: Content is protected !!