News March 4, 2025
75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.
Similar News
News March 4, 2025
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.
News March 4, 2025
టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.
News March 4, 2025
పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.