News March 4, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు BIG UPDATE

AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా, ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్‌సైటులో తమ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.
Similar News
News March 4, 2025
పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
News March 4, 2025
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News March 4, 2025
Stock Markets: గ్యాప్‌డౌన్ నుంచి రికవరీ..

స్టాక్‌మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,082 (-36), సెన్సెక్స్ 72,989 (-96) వద్ద ముగిశాయి. గ్యాప్‌డౌన్లో మొదలైన సూచీలు నష్టాలను కొంత పూడ్చుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, వినియోగం, O&G షేర్లు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు నష్టపోయాయి. ఎస్బీఐ, BPCL, BEL, శ్రీరామ్ ఫైనాన్స్, Adani Ent టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, హీరోమోటో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్స్.