News March 4, 2025
తుంగతుర్తి: 18 మందికి షోకాజ్ నోటీసులు

తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 18 మందికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే మందుల సామేలు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపల్‌తో పాటు 15 మంది టీచర్లకు, ఇద్దరు వంట మనుషులు విధుల్లో లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News November 3, 2025
ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్

ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి వచ్చిన వినతులను వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
News November 3, 2025
యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.
News November 3, 2025
VJA: వన్ హెల్త్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ లక్ష్యంగా ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి ఏటా నవంబర్ 3న వన్ హెల్త్ డే జరుపుకుంటారని చెప్పారు.


