News March 4, 2025
VJA: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 11, 2026
పౌర సేవల ప్రజాభిప్రాయంలో పల్నాడుకు 2వ స్థానం: కలెక్టర్

పల్నాడు జిల్లాలో పౌర సేవలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా రెండో స్థానం సాధించినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సు ప్రయాణం, విత్తన పంపిణీ, వైద్య సేవలు, మహిళల భద్రత తదితర 39 సేవలపై ఈ సర్వే నిర్వహించామన్నారు. డిసెంబర్‌లో 68.1 శాతంగా ఉన్న ప్రజల సంతృప్తి స్థాయి 5.4 శాతం పెరిగి, ప్రస్తుతం 73.5 శాతానికి చేరిందని వెల్లడించారు.
News March 11, 2026
ట్రంప్ రిఫైనరీ ప్రాజెక్టుకు రిలయన్సే ఎందుకు?

టెక్సాస్ రిఫైనరీ ప్రాజెక్టులో <<19350969>>రిలయన్స్<<>>ను పార్ట్‌నర్‌గా చేర్చుకోవడానికి కారణం దాని ‘నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’ (NCI). ప్రపంచంలో అధిక NCI (21.1) ఉన్న రిఫైనరీ జామ్‌నగర్. అంటే ఇది చౌకగా లభించే భారీ ముడి చమురును సైతం అత్యంత నాణ్యమైన ఇంధనంగా మార్చగలదు. ఈ స్థాయి సామర్థ్యం వరల్డ్‌లో మరే రిఫైనరీకి లేదు. వెనిజులా నుంచి వచ్చే చమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి కాంప్లెక్స్ రిఫైనరీ అవసరం.
News March 11, 2026
VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.


