News March 4, 2025
పెంచికల్పేట్: వివాహిత హత్య.. భర్తపై అనుమానం!

పెంచికల్పేట మండలం లోడ్పల్లి గ్రామానికి చెందిన <<15640043>>లలిత<<>>(35) సోమవారం హత్యకు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంలో విచారణ చేపట్టినట్లు CI శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా తన అల్లుడు గణేశ్ కొన్ని రోజులుగా తన కూతురిని వేధిస్తున్నాడని, అతడే లలితను హత్య చేశాడని మృతురాలి తల్లి తాను బాయి ఫిర్యాదు చేసిందన్నారు.
Similar News
News March 10, 2026
గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు: కలెక్టర్

9 నుంచి14 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు HPVటీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం నంద్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. HPV టీకాపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 10, 2026
మస్కట్‌లో ముస్తాబాద్ యువకుడి మృతి

ఉపాధి కోసం విదేశం వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ముస్తాబాద్ మండలంలోని బట్టోనితండాకు చెందిన రాగం ప్రశాంత్(28) రెండేళ్ల క్రితం మస్కట్ వెళ్లాడు. శనివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, సోమవారం అతని సోదరుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని బంధువులు కోరుతున్నారు.
News March 10, 2026
పోలీస్ వ్యవస్థకు యువత నవ చైతన్యం: ఐజీ

పోలీస్ వ్యవస్థలోకి వస్తున్న యువత నవ చైతన్యం వంటి వారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, చిత్తూరు జిల్లాకు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. శిక్షణ కాలంలో శారీరక దృఢత్వంతో పాటు BNS, BNSS వంటి నూతన చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, సేవా దృక్పథంతో ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు.


