News March 4, 2025
గతంలో తిరిగిన దారుల్లోనే పులి మరోసారి సంచారం!

గత 20 రోజులకు పైగా పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నస్తూర్‌పల్లి అడవుల్లో సంచరించిన పులి.. అన్నారం అడవుల మీదుగా గుండ్రాత్‌పల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ స్వాతి, పలువురు అధికారులతో కలిసి అడవిలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి గతంలో తిరిగిన దారుల్లోనే తిరుగుతోంది.
Similar News
News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 4, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు.
News March 4, 2025
టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.