News March 4, 2025
సంగారెడ్డి: 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

మంజీర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తికి చెందిన సునీల్ చౌహాన్(23) కొన్ని రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన సునీల్ తిరిగి రాలేదు. హద్నూర్ పోలీసులు రాఘవపూర్ శివారులో మంజీర నది బ్రిడ్జిపై అతడి బైక్ గుర్తించారు. నదిలో నిన్న సునీల్ మృతదేహం దొరికింది. ఈనెల 26న సునీల్ పెళ్లి జరగాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
నిర్మల్: గ్యాస్ కోసం తిప్పలు.. గంటల తరబడి నిరీక్షణ

యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. నిర్మల్ జిల్లాలో 2,51,785 గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అంటే గంటల తరబడి ఫోన్‌లతో కుస్తీ చేయాల్సిందే. గ్రామాల్లో కాకుండా పట్టణాల్లో వ్యాపారం చేసుకునే హోటళ్ల నిర్వాహకులకు ఒత్తిడి తప్పడం లేదు. సిలిండర్లకు జిల్లావ్యాప్తంగా ఒకేసారి బుకింగ్ చేయడానికి ప్రయత్నించడంతో సర్వర్ బిజీగా మారిపోయింది.
News March 13, 2026
శుక్రవారం రోజున జన్మిస్తే..

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.
News March 13, 2026
SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.


