News March 4, 2025
పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Similar News
News March 10, 2026
VKB జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్..89% పూర్తి

వికారాబాద్ జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 1,62,534 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 89 శాతం నమోదు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులు కూడా త్వరగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. నమోదు పూర్తి అయిన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
News March 10, 2026
వార్ విజువల్స్ షేర్ చేస్తే జైలుకే!

సౌదీలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏపీలోని మదనపల్లెకు చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. అటు ఖతర్‌లోనూ యుద్ధానికి సంబంధించిన వీడియోలు తీశారని, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారని 313 మందిని అరెస్ట్ చేశారు. UAEలోనూ వార్ విజువల్స్ రికార్డు/షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. 1-2 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.
News March 10, 2026
బాబూ ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం తగదు: బుగ్గన

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి రెవెన్యూ వ్యవహారాలపై అవగాహన ఇంతేనా అని మాజీ మంత్రి <<19336938>>బుగ్గన<<>> రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. డోన్ నియోజకవర్గ సభలో CM చంద్రబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. భూ సమస్యలో న్యాయం జరగలేదని రైతు చెప్పిన విషయాన్ని సీఎం రాజకీయం చేయడం సరైంది కాదని విమర్శించారు. అన్నదమ్ముల సమస్య కావడంతో అధికారులు పరిష్కరించలేకపోయారన్నారు. ఆస్తుల్లో 75% దానం చేసిన చరిత్ర తమకు ఉందని పేర్కొన్నారు.


