News March 4, 2025

రోహిత్ అలా ఆడితే భారీ స్కోరు ఖాయం: మంజ్రేకర్

image

నేడు AUSతో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో రోహిత్ ఎలా ఆడతారన్నదే కీలకమని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘గిల్, విరాట్, అయ్యర్ వారిదైన శైలిలో ఆడుకుంటూ వెళ్లిపోతారు. కానీ రోహిత్ మాత్రం వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు చూడాలి. ప్రత్యర్థి స్పిన్నర్లు వచ్చే సమయానికి ఆయన కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యపడుతుంది. ఇది 350 పిచ్ కాదు. దానికి తగ్గట్టుగా తుది స్కోరును ప్లాన్ చేసుకోవాలి’ అని సూచించారు.

Similar News

News March 4, 2025

ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

image

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.

News March 4, 2025

మనుస్మృతి, బాబర్‌నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

image

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్‌నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.

News March 4, 2025

MLC కౌంటింగ్: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

image

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లు సాధించారు.

error: Content is protected !!