News March 4, 2025

పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

image

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.

Similar News

News July 10, 2025

‘X’ CEO పదవికి లిండా రాజీనామా

image

ప్రముఖ SM యాప్ ‘X’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘రెండు అద్భుతమైన సంవత్సరాల తర్వాత నేను CEO హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కమ్యూనిటీ నోట్స్ ఆవిష్కరణల నుంచి, త్వరలో ప్రారంభంకానున్న X మనీ వరకు ఈ బృందం కృషి ఎంతో గొప్పది’ అని ట్వీట్ చేశారు. లిండా రాజీనామాపై ఎలాన్ మస్క్ ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ స్పందించారు.

News July 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 10, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 10, 2025

రొట్టెల పండగకు వచ్చిన 2 లక్షల మంది భక్తులు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం 2 లక్షల మందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. భక్తుల రద్దీతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.