News March 4, 2025

మహారాష్ట్ర మంత్రి రాజీనామా

image

మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు. నిన్న రాత్రి ఎన్సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్, ముండేతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కేసు తేలే వరకు పదవి నుంచి తప్పుకోవాలని సీఎం సూచించగా ఆయన రిజైన్ చేశారు.

Similar News

News January 13, 2026

‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

image

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.

News January 13, 2026

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

image

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>