News March 22, 2024

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిల్

image

కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని, సీఎంగా ఆయనను తొలగించాలని పిటిషన్‌లో కోరారు. కాగా, సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును కోరుతోంది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

Similar News

News November 2, 2024

నేడు ‘రుషికొండ’కు సీఎం చంద్రబాబు

image

AP: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మించిన వీటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ భవనాలను నిర్మించడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News November 2, 2024

జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి

image

TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.

News November 2, 2024

మళ్లీ అల్పపీడనం.. 7 నుంచి భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.