News March 4, 2025
కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి

కర్నూలులో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ కృష్ణారెడ్డి డీ మార్ట్ వైపు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణారెడ్డి కోడుమూరు మండలం లద్దగిరిలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 15, 2026
సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 15, 2026
MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<


