News March 4, 2025
ట్రంప్ సుంకాలు.. యుద్ధాన్ని ఆహ్వానించడమే: బఫెట్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాల్ని విధించడంపై దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టారిఫ్‌లు విధించడమంటే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే. వీటి గురించి అమెరికన్లకు గత అనుభవాలున్నాయి. సర్వత్రా ధరలు పెరిగిపోతాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇక మాట్లాడదలచుకోలేదు. గత 60 ఏళ్లలో మా సంస్థ నుంచి 101 బిలియన్ డాలర్ల మేర పన్ను చెల్లించాం’ అని తెలిపారు.
Similar News
News March 4, 2025
ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.
News March 4, 2025
మనుస్మృతి, బాబర్‌నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్‌నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.
News March 4, 2025
MLC కౌంటింగ్: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లు సాధించారు.