News March 4, 2025
బాడీబిల్డర్ బ్రైడల్ లుక్స్ వైరల్

ఆమె ఓ బాడీ బిల్డర్. తన శరీరాకృతితో వందల కొద్ది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆమే కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం. తాజాగా ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వధువు గెటప్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందరిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్రదర్శిస్తూ ఫొటోకు పోజులిచ్చారు. ఎప్పుడూ బాడీ బిల్డర్ డ్రెస్సుల్లో కనిపించే ఆమె కాంచీపురం చీర, నగలతో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Similar News
News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
News March 4, 2025
ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.
News March 4, 2025
మనుస్మృతి, బాబర్‌నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్‌నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.